తెలంగాణ పత్రిక, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నకిలీ నాణేల తయారీ, సరఫరా చేస్తున్న ముఠాను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పట్టుకున్నారు. ప్రత్యేక ఆపరేషన్‌లో సుమారు రూ.లక్ష విలువైన 5 వేల నకిలీ రూ.20 నాణేలను స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ దందాలో పాల్గొన్న నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. 50 పౌచ్‌లలో నాణేలను తరలిస్తున్న క్యారియర్‌ను మొదట పోలీసులు పట్టుకున్నారు. అతడిని విచారించగా నకిలీ నాణేల సరఫరా నెట్వర్క్ జిరాక్పూర్ వరకు విస్తరించినట్లు గుర్తించారు. దీంతో అక్కడ దాడులు నిర్వహించి మరో ముగ్గురు కీలక నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో నాణేల తయారీదారుడు, అతని అనుచరులు ఉన్నారు. ఏసీపీ రాజ్‌కుమార్ నేతృత్వంలో, డీసీపీ హర్ష్ ఇండోరా పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ ఆశిష్ శర్మ బృందం ఈ ఆపరేషన్ నిర్వహించింది. ఈ ముఠా వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా, ఎంతకాలంగా ఈ దందా సాగుతోందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
