తెలంగాణ పత్రిక, రాజన్న సిరిసిల్ల జిల్లా: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం సిరిసిల్ల పట్టణంలోని హెబ్రోసు చర్చిలో జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
సమాజ రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం విధులు నిర్వర్తిస్తూ ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో ఉండాలని చర్చి పాస్టర్లు, ఫాదర్లతో కలిసి ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు. అమరవీరుల కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లవేళలా అండగా ఉంటుందని, వారి సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుందని పేర్కొన్నారు. ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యాలు కలగాలని, సమాజంలో మతసామరస్యం వెల్లివిరియాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ శ్రీనివాస్, చర్చి పాస్టర్లు, ఫాదర్లు పాల్గొన్నారు.
