తెలంగాణ పత్రిక: రాష్ట్రంలో రైతులకు, మహిళలకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత ఉందని, ఎన్నికలు ఎప్పుడొస్తాయా.. ఎప్పుడు వీరిని తరిమికొడదామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సిరిసిల్ల పర్యటనలో ఉన్న కేటీఆర్ ను తెలంగాణ భవన్ లో ఎన్ హెచ్ ఎం (NHM) ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగులు, వారి ఆకాంక్షలు, వారికిచ్చిన హామీల పట్ల ఈ ప్రభుత్వానికి ఏమాత్రం పట్టింపు లేదని మండిపడ్డారు.

మరో ఏడాదిన్నర తర్వాత కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ప్రజలే కోరుకుంటున్నారని ధీమా వ్యక్తం చేశారు. బాధ్యతాయుత నాయకుడిగా తాను బాధ్యతారాహిత్య మాటలు మాట్లాడనని స్పష్టం చేశారు.

ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చిన కేటీఆర్, ఈ సమస్యపై సమగ్రంగా చర్చించేందుకు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ కు రావాలని ఎన్ హెచ్ ఎం రాష్ట్ర కమిటీని ఆహ్వానించారు.