తెలంగాణ పత్రిక,రాజన్న సిరిసిల్ల:శ్రీశాల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారికి భక్తులు భక్తిశ్రద్ధలతో ఒడిబియ్యం సమర్పించారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా మహిళా భక్తులు సంప్రదాయబద్ధంగా ఒడిబియ్యం సమర్పించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తుల రాకతో సందడిగా మారింది. అమ్మవారి కృపతో కుటుంబాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని భక్తులు ప్రార్థించారు.