తెలంగాణ పత్రిక, హైదరాబాద్: హైదరాబాద్ CURE పరిధిలోని పలు స్వీట్ షాపులపై తెలంగాణ సేఫ్ ఫుడ్ వింగ్ (TG Safe Food Wing) మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు.
మొత్తం 12 బృందాలు ఏకాలంలో తనిఖీలు చేపట్టాయి. తనిఖీల్లో పలు షాకింగ్ ఉల్లంఘనలు బయటపడ్డాయని అధికారులు తెలిపారు.
గుర్తించిన ఉల్లంఘనలు:
- గడువు ముగిసిన FSSAI లైసెన్సులు
- గడువు తీరిన స్వీట్లను అమ్మకానికి ఉంచడం
- పాడైపోయిన స్వీట్లను తిరిగి కొత్త స్వీట్ల తయారీలో వాడడం
- అత్యంత అపరిశుభ్రమైన పరిస్థితుల్లో తయారీ
- పురుగులు, బూజు పట్టిన ఉత్పత్తులు
నిబంధనలు ఉల్లంఘించిన కొన్ని షాపులను మూసివేయనున్నట్లు, మరికొన్నింటికి నోటీసులు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. గడువు తీరిన స్వీట్లను అక్కడికక్కడే పారవేయించారు. అన్ని తనిఖీలు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలతో కూడిన నివేదిక విడుదల చేస్తామని అధికారులు పేర్కొన్నారు.
