తెలంగాణ పత్రిక, తాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని పాతూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. కృష్ణా నదిలో పడవ మునగడంతో గల్లంతైన ఇద్దరు యువకులు హరీష్, అర్జున్ మృతదేహాలు లభ్యమయ్యాయి.
ఐదుగురు యువకులు సరదాగా పడవపై షికారుకు వెళ్లగా.. నది మధ్యలో పడవ ఒక్కసారిగా ఒకవైపు మునిగిపోయింది. దీంతో ముగ్గురు యువకులు ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఈత రాకపోవడంతో హరీష్, అర్జున్ గల్లంతయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చేపట్టి ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు
