తెలంగాణ పత్రిక, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలాతో కలిసి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో మిషన్ వాత్సల్య కింద 790 మంది చిన్నారులకు ₹1.58 కోట్ల స్పాన్సర్‌షిప్ సహాయ చెక్కును అందజేశారు.

ఏప్రిల్-ఆగస్టు 2026 (5 నెలలు) కాలానికి, ఒక్కో చిన్నారికి నెలకు ₹4000 చొప్పున విద్య, పోషణ, ఆరోగ్య సంరక్షణ మరియు ఇతర అవసరాల కోసం ఈ సహాయం అందించనున్నారు.

మంత్రి శిశువిహార్‌లో అర్హులైన చిన్నారులకు UDID కార్డులను కూడా పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్, బహదూర్‌పురా ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్ కూడా పాల్గొన్నారు.