తెలంగాణ పత్రిక, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శ్రీశాల శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం స్వామివారిని గజవాహనంపై ఘనంగా ఊరేగించారు.
స్వామివారి గజవాహన సేవను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మంగళహారతులతో స్వామివారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పరిసరాలు భక్తుల సందడితో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
మహిళలు, భక్తులు ఆటపాటలతో సందడి చేస్తూ స్వామివారి ఊరేగింపులో ఉత్సాహంగా పాల్గొన్నారు. భక్తుల గోవింద నామస్మరణలతో పరిసరాలు మార్మోగాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన గజవాహన సేవ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది

